తెలంగాణకు విలన్‌ కాంగ్రెస్‌: కేసీఆర్

19
- Advertisement -

తెలంగాణకు ప్రధాన విలన్‌ కాంగ్రెస్ పార్టీ అన్నారు మాజీ సీఎం కేసీఆర్‌. వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తొలుత ఉగ్రదాడిలో మరణించిన మృతులకు నివాలి అర్పించి సభలోని వారందరూ మౌనం పాటించారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్…ఒక్కడిగా బయలుదేరి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని తెలంగాణను సాధించానని తెలిపారు కేసీఆర్.

వరంగల్ గడ్డ మీద 25 ఏళ్ల వసంతోత్సవ వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వరంగల్ .. రాణిరుద్రమ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారళమ్మ ఏలిన గడ్డ అని కొనియాడారు. ప్రజలు తమకు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెట్టామన్నారు. జలదృశ్యంలో 2001లో మహోన్నత దృశ్యం ఆవిష్కృతమైందన్నారు.

నాడు సమైక్య పాలనలో తెలంగాణ పరిస్థితి ఆగమైందన్నారు. నాటి కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూశారన్నారు. నాడు తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన వారు బీఆర్ఎస్ నేతలు అన్నారు. నాడు అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించారన్నారు. కానీ ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణను దేశంలోనే అగ్రపథాన నిలిపామన్నారు కేసీఆర్.

తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం…కానీ అలాంటి తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపామన్నారు. పడావు భూములన్నింటిని పంట భూములుగా మార్చుకున్నామని చెప్పారు. పంజాబ్‌ను తలదన్నే విధంగా పంటలు పండించామని చెప్పారు.

Also Read:మేడమ్ టుస్సాడ్స్‌లో చెర్రీ..డేట్ ఫిక్స్!

- Advertisement -