అధ్యక్షా.. కాంగ్రెస్‌కు నెక్ట్స్‌ ఎవరు!

30
congress
- Advertisement -

శతాధిక చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనేది ఇంకా తేలట్లేదు. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ పరంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆపదవి చేపట్టేందుకు అగ్రనేత రాహుల్‌ గాంధీ ముందుకు రావట్లేదు. రాహుల్‌ను ఒప్పించేందుకు హస్తం పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలమైనట్లు తెలుస్తోంది. అటు సోనియా గాంధీ కూడా విముఖంగానే ఉండటంతో కాంగ్రెస్‌కు తదుపరి అధ్యక్షులెవరనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య పార్టీ సారథి ఎన్నిక పూర్తవుతుందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల్లో ఓటేసే వారి జాబితాను కూడా సిద్ధం చేశారు. త్వరలోనే ఎన్నికల తేదీని కూడా ప్రకటించనున్నారు. అయితే ఈ పదవి చేపట్టేందుకు రాహుల్‌ మాత్రం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని రాహుల్‌ చెప్పారు. కానీ ఆయనను ఒప్పించేందుకు మేం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు చెప్పారని జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి.

ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి సారథ్య పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేనట్ట సమాచారం అనారోగ్య కారణాల రీత్యా ఆమె ఈ బాధ్యతలను కొనసాగించేందుకు సిద్ధంగా లేరని పార్టీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రియాంక వాద్రా పేరు కూడా తెరపైకి వస్తోంది. గాంధీ కుటుంబమే పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని కాంగ్రెస్‌లో అత్యధికులు భావిస్తున్నారు. కానీ గత ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాజయం చవిచూసింది. దీంతో ప్రియాంక వాద్రా పేరును కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీ తదుపరి అధ్యక్షులు ఎవరనే సందిగ్ధత వీడట్లేదు. అధ్యక్ష పదవిపై ఆసక్తిగా లేనప్పటికీ కేంద్రంపై కాంగ్రెస్‌ పోరును రాహుల్‌ ముందుండి నడిపిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఆయన కన్యాకుమారి నుంచి భారత్‌ జోడో యాత్రను ప్రారంభించనున్నారు.

- Advertisement -