ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మంచి దూకుడు మీద ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టి కేంద్రంలో అధికారం సాధించే దిశగా ముందుకు కదులుతోంది. 2014, 2019 ఎన్నికల్లో ఘోర ఓటమిపాలు అయిన కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో అలా కాకూడదని గట్టిగానే కష్టాపడుతోంది. కాగా ప్రస్తుతం అన్నీ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ బలం పెంచుకుంటూ సరికొత్త జోష్ తో ముందుకు సాగుతోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు మంచి మైలేజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. అంతకు ముందు హస్తం పార్టీ ఇమేజ్ మసకబారి ఉండగా.. జోడో యాత్రతో పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చారు రాహుల్ గాంధీ.
ఇక ఆ యాత్ర తరువాత కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది చివర్లో మరో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనుండగా అందులో కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా విజయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. ఇక అదే జోష్ లో వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా హస్తం పార్టీ ముందుకు కదులుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ అదిరిపోయే ఓపెన్ ఆఫర్ ను ప్రకటించింది. డిల్లీ, పంజాబ్ పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉంటే.. తాము మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికలకు దూరంగా ఉంటామని కేజ్రీవాల్.. కాంగ్రెస్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.
Also Read: కంటివెలుగు@100డేస్
డిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వల్ల ఓటు బ్యాంక్ లో చీలిక ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల అది కాస్త బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక రాజస్తాన్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ రాష్ట్రాలలో ఆప్ వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు కు గండి పడే అవకాశం ఉంది. అందుకే ఒక చొట పోటీ విరమించుకుంటే మరో చోట పోటీ చేయబోమనే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ముందు ఓపెన్ ఆఫర్ ను ఉంచింది. మరి ఈ ఆఫర్ పై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: బిఆర్‌ఎస్.. సింగిల్ గానే బరిలోకి ?