మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్!

7
- Advertisement -

ముగ్గురు మంత్రులపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. కర్ణాటకలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను వక్స్ బోర్డుకు చెందినవంటూ నోటీసులు ఇచ్చారు. ఈ వివాదానికి కారణం మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అని బీజేపీ ఆరోపించింది.

అబ్కారీ శాఖలో ఏటా వందల కోట్లు లంచాలు అధికారుల ద్వారానే వసూలు చేయిస్తున్నట్లు మంత్రి ఆర్బీ తిమ్మాపురపై వారం రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి.

బెళగావి జిల్లా తహసీల్దార్ కార్యాలయంలోనే రుద్రణ యడణ్ణవర్ ఆత్మహత్య చేసుకున్న కేసులో మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ పీఏ సోమును కీలక నిందితుడిగా పేర్కొంటూ ఎస్ఐఆర్ నమోదైంది.

ఈ ముగ్గురు మంత్రులపై ఆరోపణలు రావడంతో అధిష్టానం సీరియస్ అయి నోటీసులు జారీ చేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Also Read:సర్వే అధికారులకు ఎమ్మెల్యే మాధవరం షాక్

- Advertisement -