బెల్లంపల్లి..బీఆర్ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు

6
- Advertisement -

బెల్లంపల్లి మున్సిపాలిటీలో తాజా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం విశేషంగా మారింది. ఈ చేరికలతో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ గులాబీ గూటికి చేరారు. అదేవిధంగా బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామూర్తి కూడా కేటీఆర్‌ను కలిసి తన మద్దతు ప్రకటించారు.

ఈ కీలక మార్పులతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశాలు పెరిగాయి. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. తాజా చేరికలు స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయి.

Also Read:రూ.3,32,205.33 కోట్లతో ఏపీ బడ్జెట్

- Advertisement -