సోనియా గాంధీకి మరోసారి కరోనా…

25
sonia
- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. కరోనా వలన ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. సోనియా గాంధీ కుమార్తె గతంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీ సైతం ఇటీవలే కొవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీ కొవిడ్‌ బారిన పడటం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. జూన్‌లో ఆమెకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా అనంతర సమస్యలతో అదే నెల 12వ తేదీ దిల్లీలోని సర్‌గంగా రామ్‌ ఆసుపత్రిలో చేరారు. జూన్‌ 20న కోలుకుని డిశ్చర్జి అయ్యారు. రెండు నెలలు తిరగకముందే మరోసారి కరోనా సోకడం గమనార్హం

- Advertisement -