కాంగ్రెస్, బీజేపీ ‘దోస్త్ మేరా దోస్త్ ‘?

11
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీ వేరు వేరు పార్టీలైనప్పటికి సిద్ధాంత పరంగా ఒకే ధోరణి కలిగి ఉంటాయి. పైగా ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందాలు ఉన్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. పైపైకి ప్రత్యర్థి పార్టీలుగా మెలుగుతున్న లోలోపల మాత్రం దోస్త్ మేరా దోస్త్ అనే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇతర పార్టీల నేతలపై ఆయా కేసులు బనాయించే బీజేపీ సర్కార్.. కాంగ్రెస్ నేతలపై మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ వస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అంతర్గత పొత్తులో ఉన్నాయనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నానా హడావిడి చేసిన బీజేపీ తీర ఎన్నికల సమయానికి కాంగ్రెస్ కు లీడ్ ఇస్తూ కమలనాథులు సైలెంట్ అయ్యారు. దీన్ని బట్టే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న సంబంధం అర్థమౌతోందనేది కొందరి వాదన.

ఇకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ ఈ రెండు పార్టీలు కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయా ? అంటే ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవునేమో అనే సందేహాలు రాక మానవు. ” బి‌ఆర్‌ఎస్ ను నిలువరించాలంటే కాంగ్రెస్ బీజేపీ కొట్లాడితే లాభం లేదు అనే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే కాంగ్రెస్ లో కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్నామని పరోక్షంగా హింట్ ఇచ్చారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ స్పందించారు. ” ఆ2018 నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలవడంలో కాంగ్రెస్ ముఖ్య భూమిక పోషించింది. అందువల్ల తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసి పని చేయబోతునాయని తెలుస్తోంది ” అంటూ కే‌టి‌ఆర్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. మరి పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీల వ్యూహ రచన ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:కిడ్నీ వ్యాధులను..తగ్గించుకోండిలా!

- Advertisement -