Congress:కూటమిలో బిగ్ మైనస్.. కాంగ్రెసే!

43
- Advertisement -

దేశంలో మోడీ సర్కార్ ను గద్దె దించే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ కూటమిలో ఇప్పటికే 26 పార్టీలు అధికారికంగా పొత్తులో ఉన్నప్పటికి.. ఇంతవరకు కొత్త పార్టీలేవీ కూటమికి మద్దతు తెలపడం లేదు. అటువైపు ఎన్డీయే కూటమిలో 32 పార్టీలకు పైగానే మద్దతుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే గవర్నమెంట్ కు చెక్ పెట్టాలంటే బలమైన ప్రాంతీయ పార్టీల మద్దతు ఇండియా కూటమికి చాలా అవసరం. అయితే కొత్త పార్టీలేవీ ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని తెలుస్తోంది.

గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో నడిచిన యూపీఏ కూటమిలో హస్తం పార్టీ నియంత వైఖరి కొనసాగించిందనే విమర్శలు గట్టిగానే వచ్చాయి. పైగా యూపీఏ కూటమిలో కార్యకర్లపలాన్ని కాంగ్రెస్ కనుసైగల్లోనే నడిచేవాని టాక్. ఈ విధానం ఇతర పార్టీల అధినేతల్లో అసంతృప్తి పెరగడానికి ప్రధాన కారణం. ఆ తరువాత చాలా పార్టీలు యూపీఏ నుంచి బయటకు రావడంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లోనూ అదే పునరావృతం అయింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం యూపీఏ స్థానంలో ఇండియా కూటమి పోటీలో ఉండనుంది.

అయితే ఈ కూటమి ఏర్పాటులో బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. గతంలో బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్, మాయావతి వారు కూడా మద్దతు తెలిపారు. కానీ ఆ తర్వాత నితిశ్ కుమార్ కాంగ్రెస్ పక్షాన చేరి ఆయన కూడగట్టిన మద్దతు అంతా హస్తం పార్టీ చేతిలో పెట్టడంతో బి‌ఆర్‌ఎస్, బిఎస్పీ.. వంటి ఇతరత్రా పార్టీలు ఇండియా కూటమికి దూరమయ్యాయి. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న మరికొన్ని పార్టీలు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే గనుక జరిగితే 2024 ఎన్నికల ముందే కూటమి పేకమేడలా కూలిపోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. మొత్తానికి ఇండియా కూటమికి కాంగ్రెసే పెద్ద మైనస్ అని తెలుస్తోంది.

Also Read:CM KCR:24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ రావాలి

- Advertisement -