- Advertisement -
పార్టీ ప్రక్షాళనలో భాగంగా కాంగ్రెస్ నేత, ఎంపీ జైరాం రమేశ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పార్టీకి చెందిన కమ్యూనికేషన్, పబ్లిసిటీ అండ్ మీడియా, సోషల్ మీడియా వింగ్ కు జైరాంను చీఫ్‌గా నియమించారు సోనియా గాంధీ.
పార్టీ సంస్కరణల్లో భాగంగా కమ్యూనికేషన్ వింగ్‌ను మరింత పటిష్టం చేయాలని సోనియా నిర్ణయించారు. దీంతో ఈ కీలకమైన బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జైరాం రమేశ్ అప్పగించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు జైరాం రమేశ్. ఇంగిష్ భాషపై అపారమైన పట్టున్న ఆయన ఆయా అంశాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సందిస్తారు. అందుకే పార్టీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది.
- Advertisement -