రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారా? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

525
Vh Komati Revanth
- Advertisement -

ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉంది. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇక తెలంగాణలో మాత్రం మూడు సీట్లతో సరిపెట్టకుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వపై నమ్మకం లేకనే తాను పార్టీ మారినట్లు చెప్పారు ఎమ్మెల్యేలు. ఇక ఇటివలే కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇందుకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈదీక్షకు కాంగ్రెస్ పెద్దలు అందరూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నేతలు మాత్రం ఆ దీక్ష వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ వైఫల్యాలపై ముందుండి కొట్లాడే వీరిద్దరూ ఇప్పుడు దీక్షకు రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఇద్దరు నేతలు ఆందోళనలో పాల్గొనకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తప్పుబట్టారు. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ఇటీవల రైల్వే జీఎంను కలిసిన రేవంత్ రెడ్డి, ఎందుకనో రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలపై రియాక్ట్ కావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కోమటి రెడ్డి సైతం హైదరాబాద్‌లోనే ఉన్నా, పార్టీ నేతలంతా రోడ్డెక్కినా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం నేతలకు మింగుడు పడటం లేదట.

- Advertisement -