దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయమే ఫెడరల్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆర్థిక విషయాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలన్నది కేసీఆర్ కోరిక. కేసీఆర్ తలపెట్టిన ఫ్రంట్ కు చాలా మంది ప్రాంతీయ పార్టీల నేతలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఫ్రంట్ ను కాంగ్రెస్ కీలక నేత కూడా సమర్ధించారు. ఈవిషయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కేసీఆర్ ఫ్రంట్ సరైనదేనని చెప్పారు. దేశ బాగుకోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం సరైందేనని చెప్పారు.
తాజాగా ఆయన ఒక మీడియాతో మాట్లాడూతూ.. ప్రాంతీయ పార్టీలపై నరేంద్ర మోడీ వివక్ష చూపుతున్నారని ..ప్రాంతీయ పార్టీలు ఎప్పటికి బీజేపీతో కలవబోవని స్పష్టం చేశారు. ప్రాంతియ పార్టీలు ఎన్నికల ముందు తమతో కలవకపోయినా.. ఎన్నికల తర్వాత తమతో స్నేహపూర్వకంగానే ఉంటాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత మద్దతివ్వడం పట్ల దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.