రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన వీహెచ్

249
v-hanumantha-rao
- Advertisement -

ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. ఇవాళ ఉదయం వీఐపి దర్శనంలో ఆయన తిరుమల తిరుపతిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాహుల్ గాంధీ ఆలోచన విధానం మారాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో సినియర్ కార్యకర్తలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు.

నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఒక కులం వారే కాంగ్రెస్ పార్టీని ఏలుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీ, ఎస్సీలను పక్కన బెట్టి అగ్రకులాల వారే పెత్తనం ఎలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినా సామాజిక న్యాయం జరగడం లేదన్నారు.

నిజమైన కాంగ్రెస్ వాదులను పక్కన బెట్టి..పార్టీలు మారిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి అంశాలన్నింటిపై దృష్టిసారించి రాహుల్‌ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తే పార్టీ బాగుపడుతుందన్నారు.

- Advertisement -