కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మోతీలాల్ వోరా

339
motilal-vora Rahul Gandhi
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ చీఫ్‌గా కొనసాగలేనని స్పష్టం చేస్తూ రాహుల్ రాజీనామా త‌ర్వాత‌ లేఖ విడుదల చేశారు. అయితే ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరాను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు మోతీతాల్ వోరా అధ్యక్షుడిగా ఉండనున్నారు. మోతీలాల్ వోరా ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వోరా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో అతన్ని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.

వోరా గతంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మాత్రమే అని.. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ సీనియర్లకు సూచించారు.

- Advertisement -