శాసన సభనుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

360
tsassembly
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ కు సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో పదే పదే అడ్డు తగులుతూ నినాదాలు చేస్తుండడంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ వారిని సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రతిపాదించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, అనసూయ, వీరయ్య, దుద్దిళ్ల శ్రీధర్ బాబును సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఒక రోజు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

- Advertisement -