దొశ‌లు వేసుకుంటున్న విజయ్ హీరోయిన్

372
aishwarya
- Advertisement -

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో హీరోయిన్ గా నటించి ఐశ్వర్య రాజేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హీరోయిన్ ఇప్పుడు రోడ్డు ప్రక్కన దోశలు వేస్తుంది. షూటింగ్ విరామ సమయంలో రోడ్డు ప్రక్కన ఉన్న దోశలు వేస్తున్న ఒక మహిళ నుంచి పెనం తీసుకుని కాసేపు ఎగ్ దోశలు వేస్తూ సందడి చేసింది. ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది హీరోయిన్.

ఐశ్వ‌ర్య దోశ‌లు వేసిన విధానం చూస్తుంటే ఆమె చాలా ఎక్స్‌ప‌ర్ట్‌లా ఉందే అని నెటిజ‌న్స్ అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం కబాలి ఫేమ్ పా రంజిత్ నిర్మిస్తున్న మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న టక్ జగదీష్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుంది.

- Advertisement -