నేడు టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

253
-nakrekal-mla-chirumarthi
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీకీ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించగా..త్వరలోనే మరికొంత మంది చేరనున్నట్లు ప్రకటించారు. నిన్న సాయంత్రం కాంగ్రెస్ అధికార ప్రతనిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. శంషాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన జాయిన్ అయ్యారు.

ఇక నేడు మరో ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పకోనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ భవన్ లో సాయంత్రం 4గంటలకు జరిగే ఈకార్యక్రమంలో మంత్ర జగదీశ్వర్ రెడ్డితో పాటు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోననున్నారు. ఈసందర్భంగా నిన్న నకిరేకల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అవసరమైతే తన కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..

- Advertisement -