తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిషేక్ సింఘ్వి. భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో అమరుడైన కల్నల్ బాబు భార్య సంతోషిని డిప్యూటీ కలెక్టర్గా నియమించడం సంతోషకరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు తెలంగాణ ముఖ్యమంత్రి చొరవను అనుసరించాలని తెలిపారు. ఇలా చేయడం ద్వారా కల్నల్ సంతోష్ బాబును కోల్పోయిన బాధలను తగ్గించే వేగవంతమైన మార్గం అన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని కోరారు.
కాగా ఇవాళ సూర్యపేట లోని కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లారు సీఎం కేసీఆర్.కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని గౌరవిస్తూ వారి సతీమణి సంతోషికి గ్రూప్1 ఉద్యోగ నియామక పత్రంతోపాటు,,రూ.5 కోట్ల చెక్కు,570 గజాల స్థలం డాక్యుమెంట్లను అందజేశారు సీఎం కేసీఆర్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.