కాంగ్రెస్ కు మరో షాక్..టీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే

361
Arepalli
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీమానాలు చేస్తుంటే ఎంచేయాలో అర్ధం కానీ పరిస్ధితిలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఇటివలే ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో కీలక వ్యక్తి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఆ పార్టీకీ రాజీనామా చేశారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన నేడు పార్టీలో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజుల క్రితమే ఆయన స్ధానిక టీఆర్ఎస్ నేతలతో చర్చించి ఈనిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు సీనియర్‌ నేత పార్టీని వీడడం.. కాంగ్రెస్‌ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు ఆరెపల్లి మోహన్. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది పనులను చూసీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2014,2018ఎన్నికల్లో రసమయి బాలకీషన్ చేతిలో ఓటమిపాలయ్యారు.

- Advertisement -