గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను గోసపెట్టాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఆంధ్రా నాయకులకు తెలివిలేదు కాబట్టే రైతులకు 24 గంటలకు కరెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతు బీమా చాలా అద్భుతమైన పథకంమని ఇప్పటివరకూ 3వేల400 రైతు కుటుంబాలను రైతు బీమాతో ఆదుకున్నామని స్పష్టంచేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పేదలకిచ్చే పెన్షన్ రెండింతలు చేస్తున్నామని హామి ఇచ్చారు. టీఆర్ఎస్ ఆశీర్వాద సభలకు వచ్చే జనాలను చూస్తుంటే నియోజకవర్గ సభలా..జిల్లా సభలా అనిపిస్తోందన్నారు. తాను తెలంగాణ తెస్తానంటే ఎవరూ నమ్మలేదని, బక్కపలచని మనిషితో ఏమవుతుందిలే అని అందరే హేళన చేశారని గుర్తుచేసుకున్నారు.
గ్రామాల్లో వృద్దులంతా కేసీఆర్ పెద్ద కొడుకుగా భావిస్తున్నారని చెప్పారు. కుల మతం బేధం లేకుండా దేశంలోనే ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేసుకున్నామని చెప్పారు. నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్ధి వేముల వీరేశంను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపియాన్నాయలని ప్రజలకు విజ్నప్తి చేశారు.