Cong Vs DMK:ఒక్క ఏడాదిలోనే!

1
- Advertisement -

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే మధ్య దూరం పెరుగుతూనే ఉంది. విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ చేరడంతో స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ బర్త్ డే సందర్భంగా స్టాలిన్.. రాహుల్‌ని నా సోదరుడు అని అభివర్ణించగా సీన్ కట్ చేస్తే తాజాగా స్టాలిన్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గతేడాది రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎం.కె. స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ…. ఆలోచన, దార్శనికత,ఆశయంతో ముడిపడి ఉన్న నా ఆదర్శాల సోదరుడు అని రాహుల్‌ని అభివర్ణించారు. అంతేకాకుండా మీరు ఇలాగే దృఢంగా నిలబడి, ధైర్యంతో నడిపించాలని కోరుకుంటున్నాను. ఉజ్వల భారతదేశం వైపు మనం సాగించే ప్రయాణంలో విజయం మనదే అవుతుంది అని అన్నారు.

కానీ తాజాగా దానికి పూర్తిగా భిన్నంగా శుక్రవారం రాహుల్ గాంధీకి విషెస్ తెలిపిన స్టాలిన్…గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. దీంతో ఒక్క ఏడాదిలోనే ఎంత మార్పు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే స్నేహపూర్వక వాతావరణం నుండి కేవలం వృత్తిపరమైన సంబంధంగా మారిపోయిందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Also Read:KTRను కలసిన TSEA ప్రతినిధులు

అయితే ముఖ్యమంత్రి విజయ్ సోషల్ మాత్రం రాహుల్ గాంధీని తన ప్రియమైన సోదరుడు అని సంబోధిస్తూ..ప్రజా సేవలో ఆయనకున్న నిబద్ధతను కొనియాడారు. దేశ ప్రగతి, ప్రజాస్వామ్య విలువల రక్షణ, మరియు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం మీరు నిరంతరం గళమెత్తుతున్నందున మీకు మంచి ఆరోగ్యం, సుదీర్ఘ ఆయుష్షు కలగాలని కోరుకుంటున్నాను అని విజయ్ తన సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -