పొంగులేటి వైఖరితో కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్?

31
- Advertisement -

కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీతో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. బి‌ఆర్‌ఎస్ పార్టీ లోనుంచి బహిష్కరించ బడిన తరువాత చాలా సమయం గ్యాప్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరారు పొంగులేటి. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు ఉంది. దీంతో ఆయన ద్వారా ఖమ్మం జిల్లాలో సత్తా చాటలని చూస్తోంది హస్తం పార్టీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టున్నప్పటికి.. ఈసారి అక్కడ అధికార బి‌ఆర్‌ఎస్ వేగంగా పుంజుకుంది..

ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లోనూ బి‌ఆర్‌ఎస్ సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కంచుకోటగా ఉన్న ఖమ్మం చేజారిపోయే అవకాశం ఉందని హస్తం పార్టీలో గుబులు రేగుతోంది. ఇదిలా ఉండగా పొంగులేటి వ్యవహారం ఆ పార్టీని మరింత కలవరనికి గురి చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని జనరల్ కేటగిరీలో ఉన్న మూడు స్థానాలకు పొంగులేటి దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం, పాలేరు, కొత్త గూడెం నియోజిక వర్గాలలో ఇతర నేతలకు అవకాశం రాకుండా చేసేందుకే పొంగులేటి మూడు స్థానాలకు అప్లై చేసుకున్నాడనే వాదన వినిపిస్తోంది. మాజీ మంత్రి తుమ్మల మరియు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Also Read:దేశ ప్రజలే ఈ అవార్డ్ గెలుచుకున్నారు..

వీరిద్దరు పాలేరు మరియు కొత్తగూడెం టికెట్లను ఆశించే అవకాశం ఉంది. అందుకే వారు ఒకవేళ పార్టీలో చేరితే టికెట్లు వారికి వెళ్లకుండా పొంగులేటి రిజర్వ్ చేఊసుకున్నాడని.. ఆ తరువాత తన అనుచరులలో ఇద్దరికీ ఆయా స్థానాలు కేటాయించి తను మాత్రం కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు పొంగులేటి ప్లాన్ చేస్తున్నాడని వినికిడి. దీంతో అధిష్టానంతో సంబంధం లేకుండా జిల్లాలో పొంగులేటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పొంగులేటి వ్యవహారం ఆ పార్టీలో కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశం లేకపోలేదు.

Also Read:కాంగ్రెస్ టికెట్ల అమ్మకం.. నేడే లాస్ట్!

- Advertisement -