ఈ మధ్య తెలంగాణలో బిఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు లకు సంబంధించిన చర్చ ఎక్కడ చూసిన హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వీరిద్దరు ఏ పార్టీలోకి వెళతారు ? వీరిద్దరి తదుపరి ప్లాన్ ఏంటి ? ఇలా రకరకాల ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మొదట ఈ ఇద్దరు బీజేపీలో చేరతారనే టాక్ గట్టిగా నడిచింది ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేంద్ర వీరినిద్దరిని బీజేపీలోకి తీసుకోచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించారు. కానీ పొంగులేటి, జూపల్లి మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరచలేదు. ఆ తరువాత వీరు ప్రత్యేక పార్టీ పెడతారనే టాక్ కూడా నడిచింది.. అది కూడా కార్యరూపం దాల్చలేదు.
Also Read: CMKCR:ఘనస్వాగతం
ఇక ఆ తరువాత కాంగ్రెస్ లో చేరేందుకు ఈ ఇద్దరు సిద్దమయ్యారనే టాక్ బయటకు వచ్చినప్పటికి.. పొంగులేటి, జూపల్లి మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఎట్టకేలకు వీరిద్దరు కాంగ్రెస్ లోనే చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు లు. తాజాగా ఈ ఇద్దరి నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించబోయే బహిరంగ సభలో ఇద్దరు అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఆదిపత్య విబేదాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ ఇద్దరి నేతలకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం కల్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రభావం ఎలా ఉంటుందో అనేది.
Also Read: MODI:ఒకే దేశం రెండు చట్టాలా..? అవసరమా..!