మద్యం దుకాణాలపై నిఘా నేత్రం..

307
- Advertisement -

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మద్యం దుకాణాలపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మద్యం నియంత్రణకు ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో అబ్కారీశాఖ సమావేశమైంది. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, అబ్కారీ శాఖ ఉప కమీషనర్లు, సహాయ కమిషనర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఎన్నికల సందర్బంగా అబ్కారీ శాఖ చేపట్టాల్సిన చర్యలపై కమిషనర్ సోమేష్ కుమార్ సమీక్షించారు.

అనంతరం సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మద్యం దుకాణాలు, బార్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం సరఫరా చేయోద్దని.. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం పంపిణీ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1800425252523కి ఫోన్ చేయాలని ఆయన సూచించారు.

- Advertisement -