- Advertisement -
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు నమోదైంది. మంత్రి హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి సభలో హరీష్‌రావుపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంత్రి హరీష్‌రావుపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రైవేటు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రజలకు, మంత్రి హరీశ్ రావుకు తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.జగ్గారెడ్డి భాష సవ్యంగా లేనిపక్షంలో ఆయన నివాసం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -