చిక్కుల్లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్.. పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు..

176
- Advertisement -

ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన సినిమా మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్. ఈ సినిమా అప్ప‌ట్లో మంచి సక్సెస్‌గా నిలిచింది. అయితే దిల్‌రాజు ప్రొడక్ష‌న్‌లో వచ్చిన ఈ సినిమా స్టోరీ తో ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు దిల్ రాజు.

ఈ సినిమా స్టోరి త‌ను రాసుకున్న ‘నా మ‌న‌స్సు నిన్న కోరె’ అనే న‌వ‌ల నుంచి కాపీ పొట్టారు అని ఆ న‌వ‌ల ర‌చ‌యిత్రి శ్యామ‌తలారాణి మాదాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

Complaint filed against Dil Raju for plagiarising Prabhas's Mr Perfect ..

దీంతో పోలీసులు స‌ద‌రు నిర్మాతపై కాపీ రైట్స్ చ‌ట్టాల‌ కింద కేసులు నమోదు చేసి, ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ‘మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్’ సినిమా ఏప్రిల్‌ 2011లో విడుద‌లైంది. దశరథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ కాజల్‌, తాప్సీ న‌టించారు.

డార్లింగ్ సినిమా త‌రువాత ప్ర‌భాస్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ సినిమాలో న‌టించాడు. ఆ స‌మ‌యంలో వ‌రుస‌ ప్లాప్‌ల‌తో ఉన్న ప్ర‌భాస్‌.. ఈ రెండు సినిమాలు హిట్ కావ‌డంతో మ‌ళ్లీ హిట్ల బాట‌ప‌ట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -