శ్రీశైలం ఘ‌ట‌న‌పై హ్యూమ‌న్ రైట్స్‌కు ఫిర్యాదు

9
- Advertisement -

శ్రీశైలంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌(NHRC)కు ఫిర్యాదు వెళ్లింది. దీక్ష పూర్తి చేసి, ఇరుముడితో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల సీనియర్ న్యాయవాది ఫణీంద్రనాథ్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. భక్తులు శాంతియుతంగా దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్న సమయంలో, ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా పోలీసులు లాఠీచార్జ్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా ఆయన పేర్కొన్నారు.

శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రంలో భక్తులపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని ఫిర్యాదులో తెలిపారు. దీక్షతో, నియమ నిష్ఠలతో వచ్చిన స్వాములపై లాఠీలు ప్రయోగించడం వారి గౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారని, కొందరు భయాందోళనలకు గురయ్యారని వివరించారు.

ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులు, అలాగే ఆలయ పాలక మండలిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. భక్తుల హక్కులను కాపాడేందుకు NHRC వెంటనే జోక్యం చేసుకుని, స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా ఆయన అభ్యర్థించారు.

Also Read:పొట్లకాయ రసం..ప్రయోజనాలెన్నో!

శ్రీశైలంలో శివ భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ ను ఎక్స్ వేదికగా ఖండించారు మాజీ సీఎం వైఎస్ జగన్. శ్రీశైలంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది… పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా ఏర్పాట్లు చేయలేదు అన్నారు.

- Advertisement -