ఈ తప్పు చేస్తే..మీ వాట్సాప్‌ బ్యాన్!

219
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ తాజాగా భారతీయులకు షాకిచ్చింది. ఏకంగా 23 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం విధించింది.

అయితే వాట్సాప్ ఉపయోగించేటప్పుడు చేయకూడని తప్పుల గురించి తెలుసుకుంటే మంచిది లేదంటే మీ వాట్సాప్ అకౌంట్ కూడా బ్యాన్ అవడం గ్యారెంటీ.ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో వినియోగదారుని చేర్చినట్లయితే ముందుగా వారి అనుమతి తీసుకోండి.

వాట్సాప్‌లో మీకు తెలిసిన లేదా మీతో మాట్లాడాలనుకునే వినియోగదారులకు మాత్రమే మెస్సేజ్‌ పంపించండి లేదంటే బ్యాన్ అవడం ఖాయం. అలాగే ఒక వినియోగదారు నుంచి మరొకరికి పదేపదే ప్రచార లేదా ఫార్వార్డ్ మెస్సేజ్‌లని పంపకూడదు. వాట్సాప్‌ సేవా నిబంధనలను ఎప్పుడూ ఉల్లంఘించవద్దు. నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఖాతా నిషేధానికి గురవుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -