తెలుగుదేశం పార్టీ నాయకుడు వేణుమాధవ్‌కు బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌పై కమీడియన్ వేణుమాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దీంతో వైసీపీ కార్యకర్తలు వేణుమాధవ్ ని టార్గెట్ చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన కొంతమంది వైసీపీ అభిమానులు, కార్యకర్తలు వేణుమాధవ్‌ను సోషల్ మీడియాలో ఏకేశారు.
అయితే…వైసీపీ కార్యకర్తలు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ.. వేణమాధవ్ ఆదివారం రాత్రి కర్నూలు రెండోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను నంద్యాల ఉపఎన్నిక ప్రచార నిమిత్తం కర్నూలుకు వచ్చానని, ఈనెల 19న వైసీపీ కార్యకర్తలు తనకు ఫోన్‌చేసి అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే కొంతమంది కార్యకర్తలు తనను బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని పోలీసులకు చెప్పారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పత్రాన్ని డీఎస్పీ రమణమూర్తి, సీఐ డేగల ప్రభాకర్‌కు సమర్పించారు.
కాగా, శనివారం నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ప్రచారంలో పాల్గొన్న వేణుమాధవ్.. ‘మూర్ఖుడు, బుద్ధిలేనోడు, బట్టేబాజ్’ అంటూ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో మీడియాలో విపరీతంగా ప్రసారమైంది.
సోషల్ మీడియాలో సైతం హల్‌చల్ చేసింది. మొత్తానికి నల్లబాలు నల్లతాచు లెక్క రెచ్చిపోవడానికి ఇది సినిమా కాదు కదా. అందుకే వైసీపీ కార్యకర్తలు తనను చంపుతానని బెదిరిస్తున్నారని వేణు పోలీసులను ఆశ్రయించారు.