గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ నటుడు,కమెడియన్ వేణు మాధవ్ ఇవాళ తుది శ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణు ఆరోగ్యం క్షీణించడంతో యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
అభిమానుల సందర్శనార్ధం వేణు మాధవ్ భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్‌లో రేపు అందుబాటులో ఉంచుతామని శివాజీరాజా తెలిపారు. అనంతరం మౌలాలీలో వేణు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆలీ, ఉత్తేజ్ వెల్లడించారు.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సంప్రదాయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. పేద వారికి ఎంతో సాయం చేసేవాడని, ఇలాంటి వ్యక్తి తమ మధ్యలో లేకపోవడం దురదృష్టకరమన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్ ఇప్పటివరకు 600 సినిమాల్లో నటించాడు. తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.