సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతో మంది కమెడియన్లు మంచి క్రేజ్ సంపాదించిన తర్వాత హీరోలుగా వచ్చారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్లు హీరోలుగా వచ్చారు. తాజాగా ఈ కోవలోకే చేరారు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. టాలీవుడ్‌లో ప్రాధాన్యత ఉన్న కామెడీ రోల్స్ చేస్తూ ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత అంజలి లీడ్ రోల్ చేసిన హరర్ మూవీ గీతాంజలిలోనూ హీరోగా నటించి మెప్పించారు.
ఇటీవల రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ మూవీలో హీరో పక్కన సహాయ నటుడిగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి …. రైట్.. రైట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన మను దర్శకత్వం వహిస్తున్న ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడట. తాజాగా ఇప్పుడు దర్శకుడిగా కూడా అడుగులు వేసేందుకు సిద్దమయ్యాడు. రాజా ది గ్రేట్ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి – రవి తేజ కాంబినేషన్ చాలా వరకు మంచి హిట్ అయ్యింది. అయితే రాజా ది గ్రేట్ షూటింగ్ సమయంలో శ్రీనివాస్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో కూడా వర్క్ చేశాడట. ఇటీవల రవితేజకు ఒక కథను కూడా చెప్పాడట. కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.