శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ తారలు..

106
- Advertisement -

ఆదివారం తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటుడు భరత్ రెడ్డి, పాలకమండలి సభ్యులు మొరంశెట్టి రాములు, సినీ హాస్యనటుడు సప్తగిరిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

ఆలయం వెలుపల నటుడు భారత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నప్రసాదాలు వారానికి రెండు రోజులు సిరిధాన్యాలతో ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. భారత దేశం తరువాతి తరాలు ఉండాలంటే.. అలాంటి మార్పు అవసరం ఉందన్నారు. తినే విధానంలో మార్పు రావాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నామన్నారు. మిల్లెట్ మార్వెల్స్ సంస్థ ద్వారా జాతీయ స్థాయిలో సిరిధాన్యాలు ప్రాముఖ్యతపై అవగాహనా కల్పించనున్నామని తెలిపారు. ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఆహారం తినే విధానంలో మార్పు తీసుకొచ్చేనందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

శ్రీవారి దర్శన అనంతరం ఆలయం వెలుపల సప్తగిరి మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.మరిన్ని మంచి సినిమాలతో మీకు వినోదాన్ని అందిస్తానన్నారు.మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నని, ఈ అవకాశం రావడం చాల సంతోషమన్నారు. మేలో ఎయిట్ సినిమా విడుదల కానుంది. గోల్డ్ మ్యాన్ షూటింగ్ దశలో ఉందన్నారు సప్తగిరి.

- Advertisement -