ప్రముఖ సినీ నటుడు ఆలీకి ఏపీ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. చాలా కాలంగా ఆలీకి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది. 2019 ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీలో చేరారు. ఆయనకు నాటి ఎన్నికల్లోనే సీటు ఇస్తారని భావించినా.. ఆయన పోటీ చేయలేదు. ఆ తరువాత ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
అయితే కొద్ది రోజుల క్రితం ఆలీ తన సతీమణితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి కలిసారు. ఆ సమయంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పారు. దీంతో..అప్పుడు అటు రాజ్యసభ – ఇటు ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. ఆలీని మైనార్టీ కోటాలో రాజ్యసభకు లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ ఆలీ తాను సీఎం జగన్ తో కలిసిన సమయంలో ఎటువంటి పదవి కావాలని కోరలేదని.. ఏ బాధ్యత అప్పగించినా సిద్దమేనని స్పష్టం చేసారు. ఆ తరువాత ఇప్పుడు ఆలీకి ప్రభుత్వంలో సలహాదారు పదవి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కేటాయించారు. ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పేరు ఖరారైంది. గతంలో జనసేనాని పవన్ కల్యాణ్ తో సన్నిహితంగా ఉండే ఆలీ, రాజకీయంగా మాత్రం జగన్ కు దగ్గరయ్యారు.
ఇవి కూడా చదవండి