- Advertisement -
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ అత్యంత మందకొడిగా సాగుతోంది. ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో యువత ఎక్కువగా కనిపించకపోవడం పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఓ వృద్ధురాలు ఓటేసిన ఫొటోను ట్విట్టర్‌లో చూసిన కేటీఆర్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. బయటికి వచ్చి ఓటేయకుండా కేవలం ఫిర్యాదులు చేసేవారు ఆమెను చూసి నేర్చుకోవాలని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు.
కాగా, నేటి జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వృద్ధులు అత్యధిక సంఖ్యలో ఓటేయడం కనిపించింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నాయి.ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నందినగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు. ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
- Advertisement -