TTD:శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ

38
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

పల్లకీ మందుభాగంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, పక్క భాగంలో ద్వాపరయుగంలో చిన్నికృష్ణులు, వెనుక భాగంలో తమలపాకుల ప్రత్యేక అలంకరణలో హనుమంతుని ప్రతిమలను కొలువుదీర్చారు. 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 6 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు వినియోగించారు. ఈరోడ్ కు చెందిన దాత శ్రీ సెంగుట్టవన్ సహకారంతో పల్లకీ పుష్పాలంకరణ చేపట్టారు.

Also Read:BRS:మరోసారి మహారాష్ట్రకు కేసీఆర్

- Advertisement -