ఆ హీరోయిన్ విడాకులు.. నిజమే

51
- Advertisement -

నయనాలతో ఊసులు పలికే కలర్స్ స్వాతి తన ఇన్ స్టా ఖాతాలో నుంచి భర్త ఫొటోస్ తొలగించేసిందని చర్చ జరుగుతోంది. స్వాతి తన భర్త నుంచి విడాకులు తీసుకోనుందని.. అందులో భాగంగా ఇది తొలి అడుగని నెటిజన్లు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. విడాకుల సమయంలో సమంత, నిహారికలు కూడా ఇలాగే తమ భాగస్వాముల ఫోటోలు సోషల్ మీడియాలో తీసేశారని చెబుతున్నారు. దీంతో మరోసారి స్వాతి విడాకుల వ్యవహారం నెట్టింట చర్చనీయాంశమైంది. బుల్లితెర నుంచి వెండితెర దాకా ఎదిగిన నటి స్వాతి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

పైగా కలర్స్ స్వాతి తన భర్త వికాస్‌ తో ఎంతో అన్యోన్యంగా ఉండేది. మరి ఏమైందో ఏమో.. వారి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం కారణంగానే ఆమె త్వరలోనే విడాకులు తీసుకోనుంది. అసలు ఈ మధ్య సినీ సెల‌బ్రిటీల పెళ్లిళ్లు ఈ మధ్య పెటాకులు అవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది. చిన్న చిన్న విషయాలకు మనస్పర్థలు.. వెంటనే బ్రేక్ అప్ లు.. ఆ వెంటనే డివోర్స్ లు.. ఇది ప్రస్తుత సినిమా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ల పరిస్థితి. ఐతే, ఈ విడాకుల లిస్ట్ లోకి ఎక్కువగా హీరోయిన్లే చేరుతున్నారు.

Also Read:కండలు పెరగాలంటే.. ఇవి తినాల్సిందే!

చివరకు కలర్స్ స్వాతి లాంటి హీరోయిన్ కూడా ఈ లిస్ట్ లోకి చేరడం బాధాకరమైన విషయం. నిజానికి వ్యక్తిగతంగా కలర్స్ స్వాతి కి మంచి పేరు ఉంది. మంచి పద్దతి కలిగిన వ్యక్తి అని, సంప్రదాయాలను ఆమె బాగా గౌరవిస్తోంది అని కలర్స్ స్వాతికి పేరు. మరి అలాంటి వ్యక్తి కూడా ఇలా విడాకుల బాట పట్టడం ఆశ్చర్యకరం.

Also Read:సగ్గుబియ్యంతో ఆ సమస్యలు దూరం..!

- Advertisement -