వాడపల్లిలో సంతోష్ బాబు అస్తిక‌లు నిమ‌‌జ్జ‌నం

282
santhosh babu
- Advertisement -

భార‌త్ చైనా స‌రిహ‌ద్దు లడఖ్‌ గాల్వన్ లోయలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో సూర్య‌పేట‌కు చెందిన క‌ల్న‌ల్ బిక్కుమ‌ల్ల సంతోష్ బాబు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే. నేడు సంతోష్ బాబు అస్తికలను ఆయన కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు.వాడపల్లి కృష్ణ ,మూసి సంగమం లో సంతోష్ బాబు భార్య‌,కొడుకు, తండ్రి అస్తిక‌ల‌ను నిమ‌జ్జనం చేశారు.సంతోష్ బాబు కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఎమ్మెల్యే న‌ల్ల‌మోతు భాస్క‌ర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు. ‌

సంతో‌ష్‌ బాబు కుటుంబసభ్యులు వెళ్తున్న వాహనం దామరచర్ల గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు ఆ వాహనంపై పూలు చల్లారు. కల్నల్‌ సంతోష్‌బాబు అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. కాగా సంతోష్ బాబు కుటుంబ స‌భ్యుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున‌ రూ.5కోట్ల ఆర్ధిక‌‌సాయంతో పాటు అత‌ని భార్య‌కు గ్రూప్ 1 ఉద్యోగం, హైద‌రాబాద్ లో స్ధలం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. తానే స్వ‌య‌‌యంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి ఈ సాయాన్ని అందిస్తాన‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ‌

- Advertisement -