హకీంపేటకు సంతోష్ పార్ధివదేహం..మంత్రుల నివాళి

529
santhosh babu
- Advertisement -

భారత సరిహద్దుల్లో చైనా దురగతానికి బలైన కల్నల్ సంతోష్ పార్ధివదేహాం హైదరాబాద్‌లోని హాకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. గవర్నర్ తమిళి సై ,మంత్రులు మంత్రులు కేటీఆర్,జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి,మహమూద్ అలీ,ఎంపీలు నివాళులు అర్పించారు.

ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు సంతోష్ పార్ధివదేహాన్ని తరలించారు. రేపు కేసారంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులకు మాత్రమే అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట నుండి కేసారం వరకు అంతిమయాత్ర జరగనుంది.

లడఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా బ‌ల‌గాలతో సోమవారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందినట్లు ప్రకటించింది.జవాన్ల మృతిపై దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చైనా వస్తువలను బ్యాన్ చేయాలని పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు ప్రజలు

- Advertisement -