1972లో తెలుగులో పాపం పసివాడు సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. అందులో బాలనటుడి అడవిలో ప్లేన్ క్రాష్ అయి తప్పిపోతాడు. సేమ్ టు సేమ్ దక్షిణ అమెరికాలోని కొలంబియాలో జరిగింది.
మే 1న జరిగిన ఈ విమాన ప్రమాదంలో నలుగురు చిన్నారులు అమెజాన్ అడవుల్లో తప్పిపోయారు. వారి తల్లి, విమాన పైలట్, గైడ్ల మృతదేహాలు శకలాల కింద గుర్తించారు. కానీ నలుగురు చిన్నారుల ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఇందులో 11నెలల చిన్నారి, 13, 9, 4వయసు ఉన్న పిల్లలను కనిపెట్టటానికి కొలంబియా ప్రభుత్వం 100మంది స్పెషల్ ఫోర్సెస్ నుంచి మరో 70మందిని లోకల్ ప్రజల సహకారంతో ఆపరేషన్ హోప్ చేపట్టింది. 15రోజుల క్రితం పిల్లలు సురక్షితంగా ఉన్నారని కొలంబియాలో హర్షాతిరేకాలు వ్యక్తమైన కొన్ని రోజులు గడవలేదు. చిన్నారుల ఆచూకీ ఇంకా లభించలేదు.
Also Read: 277 మంది దుర్మరణం.. రైలు ప్రమాదానికి కారణం అదే !
కొలంబియా అధ్యక్షడు గ్వాస్తో పెట్రో కూడా చర్యలను వేగవంతం చేయాలని మిలటరీకి ఆదేశాలు జారీ చేశారు. మరి కొంత సైన్యం అమెజాన్‌లో 1000మైళ్ల దూరం ప్రయాణించారు. అయినా పిల్లల ఆచూకీ లభ్యం కాలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఇది లిస్బేన్ నుంచి పారిస్ అంతా దూరం ఉంటుందని పేర్కొన్నారు. మే1న ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఇన్ఫార్మ్ చేసిన కొన్ని నిమిషాలకే విమానం రాడర్ పరిధి నుంచి వేరయి అమెజాన్ అడవుల్లో క్రాష్ అయినట్టు తెలిపారు.
Also Read: బీజేపీ ” ఇంటింటి ప్రచారం ” ప్రజాగ్రహం తప్పదా ?