గద్వాలకు రోనాల్డ్ రాస్..సూర్యాపేటకు సర్పరాజ్

253
sarfaraz ahmed collector
- Advertisement -

కోవిడ్ 19 నేపథ్యంలో ముగ్గురు అధికారులను డిప్యుటేషన్ పై జిల్లాలకు పంపింది తెలంగాణ ప్రభుత్వం. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్‌లను నియమించింది. సూర్యాపేట జిల్లా అధికారిగా సర్పరాజ్ అహ్మద్, వికారాబాద్ జిల్లాకు రజత్ కుమార్,గద్వాల జిల్లా అధికారిగా రోనాల్డ్ రాస్‌లను నియమించింది.

వీరంతా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఇవాళ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.

- Advertisement -