గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన రాజీవ్ గాంధీ..

370
Collector Rajeevgandhi

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మూడు మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అయినందుకు చాల సంతోషంగా ఉంది అందుకు ఎంపీ సంతోష్‌కి ధన్యవాదాలు తెలుపుతున్న అన్నారు.మొక్కలను పెంచడం భవిష్యత్తు తరాలకు మంచిదని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ అన్నారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు కలెక్టర్ కు ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

Kumram Bheem Asifabad District Collector Rajeevgandhi Hanumanthu, IAS Today Accepted The Green Challenge and Planted Tree Sapling..