మొక్కలు నాటిన కలెక్టర్ వీపీ గౌతమ్….

518
collector
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ కు నామినేట్ చేశారు.జిల్లా అదనపు కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ సీఈఓ సన్యాసయ్య తో పాటు డి ఆర్ డి ఏ పిడి విద్యా చందన లకు గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు.

‌ఈ సందర్భంగా నాటిన మొక్క తో కలెక్టర్ సెల్ఫీ దిగారు.‌ అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇదొక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నా అన్నారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రీన్ ఛాలెంజ్ ను ఒక చైన్ సిస్టం గా కొనసాగిస్తున్నారని అందులో భాగస్వాములు కావటం నా అదృష్టం అన్నారు ఈ గ్రీన్ ఛాలెంజ్ ఉదృతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నారు.‌ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కవిత మున్సిపల్ సిబ్బంది సానిటరీ ఇన్స్పెక్టర్ గురు లింగం పర్యావరణ సూపర్వైజర్ దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -