24 గంటల్లో 1550 కేసులు…9 మంది మృతి

157
china coronavirus
- Advertisement -

తెలంగాణలో సోమవారం 1550 కేసులు నమోదయ్యాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 926 ఉండగా నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు తెలంగాణలో 36,221 కరోనా కేసులు నమోదుకాగా 365 మంది మృతిచెందారు.

ప్రస్తుతం 12178 యాక్టివ్ కేసులు ఉండగా 23,679 మంది కరోనా మహమ్మారి నుండి కొలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. రంగారెడ్డిలో 212, కరీంనగర్‌లో 86, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 53, నల్లగొండలో 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, సంగారెడ్డి 19, వరంగల్‌ అర్బన్‌లో 16, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌లో 13, సూర్యాపేట, సిద్దిపేట, జనగామ, భద్రాద్రి కొత్తగూడెంలో 10 కేసులు నమోదుకాగా వరంగల్‌ రూరల్‌, ని జామాబాద్‌లో 8, రా జన్న సిరిసిల్ల జిల్లా లో 7, పెద్దపల్లి, మెదక్‌, జయశంకర్‌ భూపాలపల్లిలో 6, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరిలో 5, వికారాబాద్‌ 3, నాగర్‌కర్నూల్‌ 2, వనపర్తి, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో ఒకకేసు నమోదైంది.

- Advertisement -