పెళ్లికూతురు కాబోతున్న కలెక్టర్‌ ఆమ్రపాలి..

609
Collector Amrapali To Get Married
- Advertisement -

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారిని ఆమ్రపాలి వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎస్పీగా పని చేస్తున్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో తెలిసిన విషయమే అయినా ఉన్నట్టుండి ఒక్కసారిగా సామాజికమాధ్యమాల్లో ఈ విషయం వైరల్ అయింది. 2011 బ్యాచ్‌కు చెందిన ఢిల్లీ ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మతో ఆమెకు ఇటీవలే వివాహం నిశ్చితార్థం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Dynamic Collector Amrapali To Get Married

ఈ నెల 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్తున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్‌ను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం రూరల్‌ జిల్లాకు కూడా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక వచ్చే నెల 18న జమ్మూలో సమీర్ శర్మతో పెళ్లి జరిపేందుకు పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న వరంగల్ కలెక్టర్ బంగ్లాలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే 25న హైదరాబాద్‌లో కూడా గెట్ టు గెదర్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధికారికంగా వెలువరించే అవకాశాలున్నట్టు సమాచారం.

- Advertisement -