ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

2
- Advertisement -

దేశంలో చలితీవ్రత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత మరింత ఎక్కువగాఉంది. చలికి ప్రజలు వణికిపోతున్నారు. సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీలకు పడిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు ఢిల్లీలోని వాతావరణ శాఖ తెలిపింది.

చలి తీవ్రతకు తోడు గాలి నాణ్యత మరింత తగ్గింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 351 వద్ద నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఎక్యూఐ వెరీ పూర్‌ కేటగిరీలో వర్గీకరించినట్లు సిపిసిబి తెలిపింది. ఆదివారం రోజు ఎక్యూఐ 294 స్థాయి వద్ద నమోదయ్యాయి. మరలా తెల్లారేసరికి గాలి నాణ్యతలు క్షీణించాయి.

Also Read:నాగబాబుతో అల్లు అర్జున్ భేటి…

- Advertisement -