చలి పంజా..వణికిపోతున్న ప్రజలు

10
- Advertisement -

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో సాధారణ జీవనంపై ప్రభావం చూపుతోంది.

లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత కేవలం 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. “ఆంధ్ర కశ్మీర్”గా పిలువబడే చింతపల్లిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.పాడేరులో ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయింది.

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో కూడా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఈ ప్రాంతంలోని గిరిజన ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి ప్రభావానికి గురవుతున్నారు. చలి నుంచి రక్షణ కోసం గిరిజనులు మంటలు వేసుకోవడం, వేడి పానీయాలు సేవించడం వంటివి చేస్తున్నారు.

Also Read:ఏసీబీ వలలో టెక్మాల్ పీఎస్‌ ఎస్‌ఐ

- Advertisement -