అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బొగ్గు ఒక ప్రధాన ఇంధన వనరు. సమాజ౦ అభివృద్ధి కొరకు, మానవుల అవసరాల కోస౦ ప్రకృతిలో భాగ౦గా వున్న ఖనిజాలను వెలికి తీయట౦ మొదలు పెట్టారు. ఖనిజాలను తవ్వితీయట౦తోనే నాగరికత అభివృద్ధి వెల్లి విరిసి౦ది. ఇనుము లేని సమాజాన్నీ, బొగ్గు లేని పారిశ్రామిక ర౦గాన్నీ ఊహి౦చలేము. ఇక బొగ్గు గనుల నుండి వాటిని వెలికితీయడంలో కార్మికుల పాత్ర మరువలేం. అందుకే వారు చేస్తున్న అవిశ్రాంత పోరాటానికి గుర్తుగా ప్రతీ ఏటా మే 4న బొగ్గు గని కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
బొగ్గు తవ్వకం అనేది ఒక ప్రమాదకరమైన మరియు శ్రమతో కూడుకున్న పని. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గని ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య కోకోల్లలు. అత్యంత సవాల్‌తో కూడిన వృత్తిలో ఇది ఒకటి కాగా వారి శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వడానికి, అసువులు బాసిన కార్మికులను గుర్తు చేసుకుంటూ ఈ రోజను బొగ్గు గని కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారు.
Also Read:హ్యాపీ బర్త్ డే..త్రిష
మొదటి బొగ్గు గని 1575లో స్కాట్లాండ్‌లో ప్రారంభించబడినప్పటికీ, భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గని 1774లో గుర్తించారు. దామోదర్ నది ఒడ్డున ఉన్న రాణిగంజ్ కోల్‌ఫీల్డ్ లో గుర్తించారు. తర్వాత దేశవ్యాప్తంగా గనులను వెలికి తీయడంతో కోల్ ఇండియా పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. భారతదేశ పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మారాయి బొగ్గు గనులు. అందుకే 2017ను జాతీయ బొగ్గు గని కార్మికుల దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి బొగ్గు గని కార్మికుల కృషి మరియు అంకితభావాన్ని గుర్తించి వారి గౌరవార్ధం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్మికుల అవిశ్రాంత కృషితో భారత్ ప్రతిఏటా వృద్ధిని సాధిస్తోంది.
ఇక తెలంగాణ బొగ్గు అంటే గుర్తొచ్చేది. సింగరేణి.. శతాబ్ధానికి పైగా చరిత్ర ఉన్న సింగరేణి ఏటేటా తన కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటూ ఉత్పత్తి, ఉత్పాదకతలో రికార్డులు సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తూ మహారత్న కంపెనీలకు దీటుగా సంస్థ అభివృద్ధి చెందుతున్నది. దేశంలోనే అత్యద్భుతమైన ప్రగతిని సాధించి బొగ్గు ఉత్పత్తితోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ బొగ్గు బ్లాకులను కైవసం చేసుకున్నది. థర్మల్, సోలార్, జియో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటూ దేశ, రాష్ట్ర అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమతోంది.
Also Read:KTR:పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ