విద్యుత్ సంస్థలపై కొంతమంది కావాలనే అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎండీ ప్రభాకర్ రావు. విద్యుత్ సౌధలోల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రం రాకముందు విద్యుత్ పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు.కొందరు విద్యుత్ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేశారు. బహుశా సమాచార లోపంతోనే అలా మాట్లాడి ఉంటారు అనుకుంటున్నారు.
ఏన్టీపీసీ ఎప్పుడు తక్కువకు విద్యుత్ ఇస్తానని చెప్పలేదు.3600 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణ టాప్. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం.రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 7778 మెగావాట్ల నుంచి ఇప్పుడు 16200 మెగావాట్ల కు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం.రాష్ట్రం వచ్చిన కొత్తలో 800 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభించు కున్నాం.మేము చెప్పేది వాస్తవాలు.వాళ్ళు చేసేవి అవగాహన లేని ఆరోపణలు
ముఖ్యమంత్రి దూర దృష్టితోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు అధిగమించాం.ఇటీవలే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కూడా తెలంగాణ విద్యుత్ పనితీరును ప్రశంసించారని చెప్పారు.
పీపీఏలు రాత్రి రాత్రే చేసుకోరు.ఇప్పటి వరకు ఒకే ఒక పీపీఏ చేసాము. 4.15 పైసలకు చేసాము. చాలా పారదర్శకంగా చేసాము.3.90 పైసలు యూనిట్ చొప్పున ఛత్తీస్ ఘడ్ తో పీపీఏ చేసుకున్నాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం.అన్ని విద్యుత్ సంస్థలు స్వయం ప్రతిప్తతితో పని చేస్తాయి. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు.దేశంలో థర్మల్ ప్లాంట్స్ లో 90 శాతం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే ఉన్నాయన్నారు.
విద్యుత్ సంస్థపై సిబిఐ విచారణ, సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ కూడా సిద్ధం.కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థకు అనేక ప్రశంసలు వస్తున్నాయి.నిన్ననే సరళలో రెండవ ర్యాంక్ వచ్చింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ గుదిబండగా ఉంది.దీనిపై అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని చెప్పారు.
.ఎంత ఖర్చు అయిన రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం అని సీఎం కేసీఆర్ చెప్పారు.ఇరు రాష్ట్రాల విద్యుత్ సమస్యపై చర్చించుకుంటున్నాం.ప్రతిదీ అవగాహన లేకుండా మాట్లాడం కరెక్ట్ కాదు.అన్ని పారదర్శకంగానే జరుగుతున్నాయి,ఏ విచారణకైనా సిద్ధం.కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొన్ని ఒడుదొడుకులు సహజమే సీఎం కేసీఆర్ కృషి తోనే సౌత్,నార్త్ కనెక్టివిటీ గ్రిడ్ సాధ్యం అయిందన్నారు.