సీఎం కేసీఆర్ ఆదేశాలతో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది: ప్రభాకర్ రావు

224
cmd prabhakar rao
- Advertisement -

వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో మేము అప్రమత్తం అయ్యాం అని తెలిపారు సీఎండీ ప్రభాకర్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2660 డిమాండ్ కు పడిపోవడం ఇదే అత్యల్పం. ఎన్టీపీసీ వారి సహకారం తో గ్రిడ్ కు ఇబ్బంది లేకుండా చేశాం.మా ఇంజనీర్స్,అధికారులు నేను కూడా రాత్రి మొత్తము మానిటరింగ్ చేశాం
మనకు మంచి ఇంజనీర్స్ ఉన్నారు మన గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు…ఎంత తగ్గిన ఎంత పెరిగిన మన గ్రిడ్ కు ఎలాంటి డొకా లేదన్నారు.

హైదరాబాద్ నగరంలో విద్యుత్ లేకపోవడం కరెంట్ లేక కాదు అపార్ట్మెంట్ లలోకి నీరు రావడం తో మేమె నిలిపి వేశాం…చాలా చోట్ల సబ్ స్టేషన్ లలో నీరు చేరింది దీనితో మా ఇంజనీర్స్ విద్యుత్ నిలిపివేశారు.నీరు తొలిగిపోగానే విద్యుత్ పునర్ ప్రారంభమం చేస్తాం అన్నారు. మూసి నది ప్రవాహంలో 200 ట్రాన్స్ఫార్మర్స్ లో కొట్టుకుపోయాయి ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పారు.

అపార్ట్మెంట్ సెల్లార్ లలోకి నీరు చేరితే విద్యుత్ నిలిపివేయండి,ఎక్కడైనా స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి…స్తంభాలు కూలిపోవడం తో వెంటనే పునరుద్ధరణ చెప్పట్టాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.హైడల్ విద్యుత్ పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కానీ 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తాం అన్నారు.శ్రీశైలం విద్యుత్ సంబంధించి త్వరలోనే నివేదిక వస్తుంది దురదృష్టవశాత్తు అందులో అధికారులకు కరోనా సోకడం తో కొంత ఆలస్యం అయిందన్నారు.

- Advertisement -