- Advertisement -
ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది శివసేన. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయగ ఆయన ఇవాళ బలపరీక్ష ఎదుర్కొనున్నారు. బలనిరూపణకు డిసెంబర్ 3 వరకు ఠాక్రేకు గడువు ఇవ్వాగా ఇవాళ మధ్యాహ్నం విశ్వాసపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.
అసెంబ్లీలో శివసేనకు 56,ఎన్సీపీ 54,కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 288. బలపరీక్ష నెగ్గాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
ఇక ఎన్‌సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్ పాటిల్ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.
Uddhav Thackeray-led Maha Vikas Aghadi (MAV) government of the Shiv Sena-NCP-Congress alliance will face a floor test in the Assembly on Saturday
- Advertisement -