తమిళంపై ప్రేమ మాటల్లో కాదు చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్.మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తమిళం పట్ల గొప్ప ప్రేమ ఉందని బీజేపీ వాదిస్తోంది. అదే నిజమైతే.. చేతల్లో ఎందుకు చూపించడం లేదు..? పార్లమెంట్‌లో సెంగోల్‌ను ప్రతిష్టించే బదులు తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగించండన్నారు.
హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదు. ఆచరణాత్మక చర్యలను అమలు చేయాలి. ప్రత్యేక పథకాలు, తక్షణ విపత్తు సహాయ నిధి, తమిళనాడుకు కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలన్నారు.
తమిళాన్ని హిందీతో సమానంగా అధికారిక భాషగా చేయండి… సంస్కృతం కంటే తమిళానికి ఎక్కువ నిధులు కేటాయించండి అని సూచించారు స్టాలిన్. కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదని.. రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలన్నారు. రైళ్లకు అంత్యోదయ, తేజస్, వందేభారత్ బదులు చెమ్మోళి, ముత్తునగర్, వైగై, మలైకొట్టై, తిరుక్కురల్ ఎక్స్‌ప్రెస్ పెట్టాలని డిమాండ్ చేశారు స్టాలిన్.
Also Read:కేసీఆర్ కృషి ఫలితం.. సీతారామ ప్రాజెక్టు

